United Airlines : విమానం టైరులో మృతదేహం....! 12 d ago
విమానం టైరులో మృతదేహం కనిపించడం కలకలం రేపింది. హవాయి ద్వీపంలోని కహూలుయీ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన యునైటెడ్ ఎయిర్లైన్స్ విమానం టైరులో అధికారులు మృతదేహాన్ని గుర్తించారు. అమెరికా షికాగోలోని ఓహే అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వచ్చింది. విమానం బయట నుంచి మాత్రమే ఎవరైనా వీల్ వెల్ లోకి వెళ్ళగలరు. ఆ వ్యక్తి అక్కడకు ఎలా చేరాడనేది తెలియాలి. ఈ అంశంపై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.